Friday 26 June 2020

సాధనాచతుష్టయ సంపత్తి - శమము

🌹. సాధనాచతుష్టయ సంపత్తి - శమము 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ 

దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము (ఇంద్రియములు మరియు భోగ్య వస్తువులు మధ్య ) - ఇంద్రియ నిగ్రహము 

 శమము అంటే అంతరెంద్రియ నిగ్రహము (మనస్సుకు ఇంద్రియములకు మధ్య ) - మనో నిగ్రహము అని చెప్పినప్పటికీ సాధనా పరముగా రెండు కలిపే జరుగుతూ ఉంటాయి.
 
ప్రాపంచిక వస్తు సంపదలు, విషయ సుఖములందు బంధమున్నదని గ్రహించి విముఖత కలిగి ఉండి మనస్సును ఇంద్రియములతో కూడనివ్వక ఆత్మ లక్ష్యమందు నిలుపుట శమము.
 
మనము గాఢముగా ఏదైనా విషయమును గురించి ఆలోచిస్తున్న సమయమున మన ముందు జరిగిన సంఘటనలను కుడా మనము గుర్తించలేము. అంటే మనస్సు ఇంద్రియములతో జోడిస్తేనే విషయములను గ్రహించాగలుగుతాము.  

కనుక ఇంద్రియ నిగ్రహ సాధనల వలన మనో నిగ్రహము బలపడితే మనో నిగ్రహ సాధనల వలన ఇంద్రియములు సులువుగా స్వాధీనమవుతాయి.
 
మనస్సు ఎందుకు బహిర్ముఖము అవుతుంది?
- విషయ సుఖములందు ఆసక్తి వలన
- విషయ సుఖములకు కావలసిన వస్తు సంపదలను ప్రోగుచేసుకోవలననే కోరిక వలన విషయాసక్తి

- విషయ వైరాగ్యము వలన, వస్తువుల కున్న పరిమితులు గుర్తించుట వలన
- వస్తు సంపదలు, విషయ సుఖములందు ఉన్న బంధము, దోషములను గుర్తించుట వలన తొలగుతుంది.
 
మనస్సు ఎందుకు అలజడికి లోనవుతుంది?
- జగత్తులో వ్యవహార సమయమున ప్రతిఫలము పట్ల ఆసక్తి కలిగి ఉండుట వలన
- జీవితములో జరుగుచున్న సంఘటనలను అంగీకరించలేక పోవుట వలనను
 
ఇవి  
- దైవీసమర్పణ భావనతో, ప్రతిఫలాపేక్ష రహిత కర్మ చేయుట వలన
- ఈశ్వర నియతిని (కర్మను) అంగీకరించుట వలనను తొలగుతాయి.
 
ఎప్పుడైతే మనస్సు బహిర్ముఖము కాక, అలజడికి లోనుకాక శాంతముగా ఉంటుందో అటువంటి మనస్సు ఆత్మ జ్ఞాన విచారణకు, తనను తానూ తెలుసుకొనే దిశగా ప్రాయాణించుటకు అనుకూలముగా ఉంటుంది.
 
ఈ విధముగా మనస్సును శమింప చేయుటను శమము అంటారు.
 
ప్రాణాయామము, జపము, ఉపాసన మొదలగునవి శమమును పెంపొందించుకొనుటకు ఉపయోగ పడు సాధనలు.
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 52 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 52

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 52 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 52 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ  

      ఖందార్ కర్ దేశ్ పాండే యొక్క కొడుకు పేరు నానా. ఇతను జమీందారు ఇంటికి చెందిన యువకుడు. సౌందర్యవంతుడై గాత్రం చాలా మధురంగా ఉండేది. శ్రీమంతుల ఇంట్లో జన్మించడం వలన జనం ఇతనిని నానాసాహెబ్ అని పిలిచేవారు. 

ఇతనికి చిన్నప్పటినుండి నృత్యగీతముల వలన ధనమార్జించు మేళగాండ్లను పరిచయం చేసుకొని వారి నృత్య గానాల యందు ఆసక్తి కలవాడై మేళగాండ్రతో స్త్రీ వేషము వేసుకొని నాట్యము చేయుటకు ఇష్టపడేవారు. 

ఆ రోజులలో దేశ్ పాండే అంటే గ్రామానికి పెద్ద వారు. వయస్సులో ఉండి సంపత్తికి వారసుడైనా కూడా ఆ మేళగాండ్రతో తిరుగుతూ నృత్యము చేయడం మానలేదు. గ్రామస్థులందరూ కలిసి ఇతనిని బ్రాహ్మణ జాతి నుండి వెలివేశారు. వెలివేశినా కూడా నాట్యంపై అభిలాషతోనే ఉండటం చూసి జనం తప్పు పడుతుంటే చివరికి మాణిక్ నగర్ కి చేరుకున్నాడు. 

    ప్రభు దర్బార్ లో నిత్యము గాన, నాట్య కార్యక్రమములు జరిగేవి. నానాకు స్వభావసిద్ధంగా ఇష్టమైన నృత్యం చేసే కోరిక తీరక, ప్రభు దర్బార్ లో ఉండి ప్రభు దర్శనం చేసుకొని తన పూర్తి కథను తెలియచేసి, ప్రభు చరణాలకు శరణు కోరుతూ నన్ను పావనము చేయండి అని వేడుకున్నాడు. 

మహారాజా! నేను అనాచారిని. నా ప్రవృత్తి మారడం లేదు, నాకు నర్తించాలనే అనిపిస్తుంది. తన పాపకర్మలను చెపుతూ ఎంత ప్రయత్నించినా కూడా నర్తించాలనే కోరిక పోవడం లేదు. దీనికి నేను ఏం చేయాలి? అని అడిగాడు.

    *అప్పుడు ప్రభువుకి అతనిపై దయ కలిగింది. అతని అంతఃకరణ ప్రభువుకి తెలుసు కనుక అతనికి ఇష్టమైన నాట్యాన్ని సరైన మార్గంలో చూపిస్తే అతను ఉద్ధరింపబడుతారని, ఆయనకు జన్మత ఇష్టమైన కోరికకు భంగం కలిగించకుండా తిరిగి ఉత్తేజం కలిగింపచేశారు. 

నీవు ఎలా నాట్యం చేస్తావో ముందు నాకు చూపించు, తరువాత ఏం చేయాలో నేను చెపుతాను. అలా ప్రభు అనగానే నానాకు అమితమైన ఆనందం కలిగింది. అన్ని సిద్ధం చేసుకొని ప్రభు ముందు స్త్రీ వేషధారణలో నాట్యం చేసాడు. అతని ప్రతిభ అద్భుతమైనది. 

అతని స్వరూపం చూసి అతని పాటను విని జనులు మోహితులయ్యారు. ఆరోజు నానా చాలా బాగా నాట్యం చేశాడు. అతని కళను గౌరవించి ప్రభువు అతనికి స్వయంగా కొన్ని పద్యాలు నేర్పించి కృష్ణునిపై ఉన్న భక్తిని పెంచి ఎలా అభినయించాలో నేర్పించారు.*

     *నానాను ద్వేషించేవారు ప్రభువు నానాకు ఆశ్రయం ఇచ్చారని తెలుసుకొని నానాను కులమునుండి పూర్తిగా బహిష్కరించవలసిందని హంపి జగద్గురువులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకొని జగద్గురువులు నానాకు, సంజాయిషీ ఇవ్వవలసిందిగా లేఖ వ్రాశారు. నానా ఆ లేఖను ప్రభువుకి చూపించగా, ప్రభువు నానాకు కొన్ని సలహాలు ఇచ్చి జగద్గురువుల వద్దకు పంపారు.*

    *తాను పాపినని తనకు శిక్ష విధించుటకు పూర్వం తన నృత్యగీతములను ఒకసారి చూడమని చెప్పగా జగద్గురువులు అంగీకరించిరి. నృత్యమును చూసి జగద్గురువులు ఆనందించి ప్రభువు ఇతనిని ఇప్పటికే పరిశుద్ధుని చేశారు, ఇంక తాను చేసేది ఏమీ లేదని చెప్పి నానాను పిలిచి ప్రసాదం ఇచ్చి పంపారు. 

ప్రసాదం తీసుకొని తిరిగి మాణిక్ నగర్ చేరిన నానా ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఉండిపోయారు.

    *ఈ విధంగా తన భక్తులకు వాళ్లకు ఇష్టమైన మార్గంలో దారి చూపించి వారిని ఉద్ధరించడం ప్రభువు యొక్క సమర్ధత. ప్రభువుది సకలమత సంప్రదాయము. ఇదే ప్రభు యొక్క విశేషము. 

ఎవరికైనా వారి కర్మలపై దోషం చూపించకుండా వారిలో ఉన్న ప్రతిభను బయటకు తెచ్చి మోక్షం యొక్క దారి చూపించేది నిజమైన సద్గురువుల శక్తి. వీరికి తప్పించి ఎవరికి ఆ శక్తి ఉంటుంది? ప్రభు చేతిలో ఉన్న వారికి అథోగతి కల్గించే శక్తి ఎవరికీ ఉండదు. ఇలా ప్రభు వద్దకు వెళ్లిన భక్తులను ఎప్పుడు ఉపేక్ష చేయలేదు.*

'మాకు పట్టుకోవడం వస్తుంది కాని విడిచిపెట్టడం రాదు' ఇది ప్రభు వాక్యం.

తరువాయి భాగము రేపు చదువు కుందాము......

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 52 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 14. Shri Shankar Manik Prabhu (1895 – 1945) - 1 🌻

Shri Shankar Manik Prabhu was no stranger to Maniknagar, even though he was not a direct descendant of the family of Shri Manik Prabhu Maharaj.  

Having been nurtured by Shri Martand Manik Prabhu in the environment of the Sampradaya from the very childhood, he was breathing nothing if not the spiritual aura that was prevailing in that area. 

He had all the opportunity for sharing the vast vision of his predecessor and when the latter was on tour, the entire administration of Maniknagar was left to the able hands of Shri Shankar Manik Prabhu. 

Under the guidance of Shri Martand Manik Prabhu he had all the opportunity for doing the Sadhana, which for him was as imperceptible as breathing itself. 

When Shri Martand Manik Prabhu inducted him in the administration of the Samsthan, he took his work itself to be his worship.  

He seemed to have imbibed unknowingly the precept of the Lord in Gita (IX.34), “On Me fix your mind; to Me be devoted; worship Me; revere Me; thus having disciplined yourself, with Me as your goal, you shall surely come to Me”.  

The day Shri Martand Manik Prabhu assigned him his work, that became his goal, that became his worship and that also became his divinity.  

He was so particular and methodical in his work that perhaps he saw Shri Manik Prabhu in every act of his. It may be said that he had no interest other than the work assigned by his mentor.  

His life was the perfect specimen of the manasa pooja as described by Shri Shankaracharya in “Shiva Manasa Pooja”.

“You are my Self, and intellect verily, is Girija, Companions are the breaths; body, verily, is the abode. Sense experience is adoration; sleep, verily, is samadhi. 

Walking on feet is Pradakshina; worship, verily, is wisdom. Every action I perform, O Shambho, all those are for your propitiation.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

నారద భక్తి సూత్రాలు - 18

🌹. నారద భక్తి సూత్రాలు - 18 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 10

🌻 *10. అన్యాశ్రయాణాం త్యాగో-నన్యతా* 🌻

            పరాభక్తుడికి అహంకారం ఉండదు. భగవత్ప్రేరణను బట్టి భక్తుడు ఆ భగవంతుని పరికరంగా పనిచేసే అహంకారం మాత్రం ఉంటుంది. పరాభక్తిలో స్థిరం కాకమునుపు భక్తుడి మనసు చిత్తవృత్తుల ప్రకారం నడిచేది.

 ఆ చిత్త వృత్తులను ఉదాసీనంగా చూడటం అలవాటైన పిదప ఇక వ్యాపారం అంటూ ఉండదు. అతడికి తెలియకుండానే వ్యాపారం జరిగిపోతూ ఉంటుంది. 

అందువలన ఆ పరాభక్తుడు కర్తగా ఉండడు, భోక్తగా ఉండడు. అతడికి ఇష్టాయిష్టాలు ఉండవు. సకల వ్యాపారాలకు భగవంతుడే అధిష్ఠానంగా ఉంటాడు. 

ఇతరమైన అధిష్ఠానం గాని, ఉద్దీపనం గాని లేకుండుటను అనన్యత అని నిర్ణయిస్తారు. అందువలన పరాభక్తుడు అన్యాశ్రయాన్ని త్యాగం చేసి ఉంటాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

దాశరధి శతకము - పద్య స్వరూపం - 41 / Dasarathi Satakam - 41

🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 41 / Dasarathi Satakam - 41 🌹
పద్యము - భావము 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 81వ పద్యము : 
దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ
కరతల హేతిచేఁ దెగి వకావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖ దార్కొనిన శలబాదికీటకో
త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
రామా! మండుచున్న అగ్నిపై దండెత్తిన మిడతల గుంపు ఆ అగ్నికి ఆహుతు అయినట్లుగా నీ నామస్మరణ మోక్షము నిచ్చుటయే కాక పలు జన్మ పాపములను ఖండించు కత్తి వంటిది.

🌻. 82వ పద్యము : 
హరిపదభక్తినింద్రియజ యాన్వితుడుత్తముఁడింద్రిమంబులన్
మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
ఎల్లప్పుడూ విష్ణుమూర్తి పాదపద్మములయందు భక్తి కలిగి ఇంద్రియములను జయించిన వానిని ఉత్తముడందురు. ఇంద్రియములకు వశము కాకుండా నిగ్రహించుటకు ప్రయత్నించిన వానిని మధ్యముడందురు. ఇంద్రియములకు బానిస అయిన వానిని అధముడందురు. నేను చెడ్డ బుద్ధి కలవాడను, అట్టి నన్ను ఏరీతిగ కాపాడెదవో రామా!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Dasarathi Satakam - 41 🌹
Sloka and Meaning 
📚. Prasad Bharadwaj
 
🌻 81th Poem : 
durita latAnusAri BavaduHKa kadaMbamu rAmanAmaBI 
karatarahEticE degi vakAvakalai canakuMDa nErcunE 
darikoni maMDucuMDu SiKa dArkoninan SalaBAdikITakO 
tkaramu vilInamaicanade dASarathI karuNApayOnidhI

🌻 Meaning : 
The set of sins growing like a creeping plant are bound to be terminated by the fierce sword of Ramanama japa just as insects like grasshopper are burnt by fire.

🌻 82th Poem : 
haripadaBaktiniMdriyaja yAnvituDuttamuDiMdrimaMbulan 
marugaka nilpanUdinanu madhyamuDiMdriyapAravaSyuDai 
paraginacO nikRuShTuDani palkaga durmatinaina nannu nA 
daramuna neTlukAcedavo dASarathI karuNApayOnidhI.

🌻 Meaning : 
A person who has conquered sense organs due to his devotion to Hari is the best. A person who tries to conquer the sense organs is second best. A person who is a slave of sense organs is the worst kind. I belong to the third category. Please save me with benevolence.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ ఆర్యా ద్విశతి - 62

🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 62 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 II ఆర్యా ద్విశతి - 123వ శ్లోకము II 🌻 

యోజనయుగళాభోగా తద్వత్పరిణాహవలయమణిభిత్తిః I
చింతామణిగృహభూమి ర్జీయాదామ్నాయమయ చతుర్ద్వారా II ౧౨౩

🌻. తాత్పర్యము :
యోజనయుగళాభోగా - రెండు యోజనముల వైశాల్యము కలిగినదియు, తద్వత్ - అంతటి, పరిణాహ - వైశాల్యము గల, వలయ - చక్రాకారమైన, మణిభిత్తిః - రత్నమయమైన గోడ కలిగినదియు, ఆమ్నాయమయ - చతుర్వేదమయమగు, చతుర్ద్వారా - నాలుగు వాకిళ్ళు కలిగినదియు అగు, చింతామణిగృహభూమిః - చింతామణిగృహము యొక్క ప్రదేశము, జీయాత్ - సర్వోత్కృష్టముగా వర్తించుగాక !!

రెండు యోజనములు వైశాల్యము కలిగి, చక్రాకారములో ఉండి, రత్నమయమైన గోడలు కలిగి, నాలుగు వేదములను నాకు ద్వారములుగా కలిగిన చింతామణి గృహము -- దిగ్విజయముగా వర్ధిల్లుగాక !!


🌻 II ఆర్యా ద్విశతి - 124వ శ్లోకము II 🌻 

ద్వారే ద్వారే ధామ్నః పిండీభూతా నవేన బింబాభాః I
విదధతు విమలాం కీర్తిం దివ్యా లౌహిత్యసింధవో దేవ్యః II ౧౨౪

🌻. తాత్పర్యము :
ధామ్నః - ఆ చింతామణి గృహము యొక్క, ద్వారే ద్వారే - ప్రతీ ద్వారము నందు, పిండీభూతా - గుంపులుగా ఉన్నవారును, నవేన బింబాభాః - క్రొత్తగా ఉదయించుచున్నట్టి సూర్యబింబ కాంతి గలవారును, లౌహిత్యసింధవః - ఎఱ్ఱదనమునకు సముద్రము వంటి వారును (ఎఱ్ఱని కాంతిపుంజము వంటివారు), దివ్యాః - ప్రకాశించుచున్నవారును అగు, దేవ్యః - దేవతాస్త్రీలు, విమలాం కీర్తిం - నిర్మలమైన యశస్సును, విదధతు - కలిగింతురుగాక !!

చింతామణి గృహమునకు ప్రతీద్వారము నందు గుంపులుగా ఉన్న, సూర్యకాంతి తేజస్సు కలిగిన దేవతా స్త్రీలు మాకు నిర్మలైన యశస్సును కలిగింతురుగాక !!

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

The Masters of Wisdom - The Journey Inside - 103

🌹 The Masters of Wisdom - The Journey Inside - 103 🌹
🌴 Fiery Aspiration - 5 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 Devotion 🌻

What we do with a concentrated focus we call devotion. Without devotion and appropriate aspiration we don’t find any mental alignment. Up to the present many people are still quite emotional. 

Emotions are often adulterated by selfish desire, an exuberant enthusiasm leads to problems. We might burden ourselves with unnecessary responsibilities, take over work of other people and thus incur consequences.

However, the unregulated emotions can be balanced through right direction and transformed into aspiration. 

Aspiration is also an emotion, but a directed one. For emotional people role models are important, which they follow then. 

This is called the childhood stage of consciousness. Through right models the emotions can be directed into noble channels. 

Then such people can do much better work with joy and enthusiasm than mentally oriented people.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources: Master K.P. Kumar: The Aquarian Cross / notes from seminars. Master E. Krishnamacharya: Lessons on the Yoga of Patanjali.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 80

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 80 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 *సాధన- సమిష్టి జీవనము - 1* 🌻 

ప్రస్తుతము వర్తిస్తున్న కుంభయుగములో ఆధ్యాత్మిక సాధనకు సమిష్టి జీవనములో భాగస్వామ్యము తప్పనిసరి అని పరమగురువులు ఉపదేశిస్తున్నారని అందరికీ తెలుసు.‌సంఘములో మెలగడంలో ఎగుడుదిగుడులు సర్దుకోక పోవడం వల్ల సాధన స్తంభిస్తుందనేది యథార్థము. 

సాధకుడు జపతపాలు, ప్రార్థనా హోమాలు శ్రద్ధగా నెరవేర్చవచ్చు ఇవన్నీ భక్తి సాధనకు సామాగ్రియే గాని భక్తి కావు. సమాజంలో నిరంతరమూ అంతర్యామిని దర్శిస్తూ, అ అనుభూతిలో ప్రతి కర్తవ్యము ‌అంతర్యామికి అర్చనగా చేయడంలో సాధన ఎదుగుతుంది. 

సాధకుడు ఇందుకుగాను తాను పూజించే ఏ గురువును అయినా ఇష్టదేవతనయినా సరే సర్వాంతర్యామిగా ముందు భావనలో రూఢీచేసుకోవాలి. అలా లేని సందర్భంలోనే,‌ వివిధమార్గాలు, వివిధ గురువులు, మతాలు గోచరించి, ఎక్కువ తక్కువలు, కలహాలు ఏర్పడతాయి.‌ 

అంతేకాదు సాధకుడు నిర్వర్తించే జపతపాదులు గాని, సేవాకార్యక్రమాలు గాని యావజ్జీవితము శ్రద్ధగా అనుష్ఠించాలి. మంచి పనులను ఏ మాత్రము విడువకుండా, ప్రతిదినము ఒకే సమయానికి అభ్యాసం చేస్తూ పోతేగాని, వానిలో దృఢత్వము రాదు, శ్రద్ధ ఏర్పడదు. 

కాని‌ ఇందులో ఒక ఇబ్బంది ఎదురవుతుంది, ఒక మంచిపనిని ఉదాహరణకు హోమియో వైద్య సేవను ప్రారంభించినప్పుడు కలిగే ఉత్సాహము, కార్యదీక్ష కొన్నేండ్లు అయ్యేసరికు క్రమంగా మాటు పడుతుంటాయి. ఇక సేవ యాంత్రికముగా‌ మాత్రమే‌ సాగుతుంటుంది. 

సాధకుని ద్వారా జరిగే సేవ వలన సమాజంలో వారికి ప్రయోజనం చేకూరవచ్చునే గాని, అతనికి మాత్రం వికాసము, పరిశుద్ధి లభింపక, ఎదుగుదల ఆగిపోవును.
......✍ *మాస్టర్ ఇ.కె.*
(To be Continued)
🌹 🌹 🌹 🌹 🌹