Friday 26 June 2020

నారద భక్తి సూత్రాలు - 18

🌹. నారద భక్తి సూత్రాలు - 18 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 10

🌻 *10. అన్యాశ్రయాణాం త్యాగో-నన్యతా* 🌻

            పరాభక్తుడికి అహంకారం ఉండదు. భగవత్ప్రేరణను బట్టి భక్తుడు ఆ భగవంతుని పరికరంగా పనిచేసే అహంకారం మాత్రం ఉంటుంది. పరాభక్తిలో స్థిరం కాకమునుపు భక్తుడి మనసు చిత్తవృత్తుల ప్రకారం నడిచేది.

 ఆ చిత్త వృత్తులను ఉదాసీనంగా చూడటం అలవాటైన పిదప ఇక వ్యాపారం అంటూ ఉండదు. అతడికి తెలియకుండానే వ్యాపారం జరిగిపోతూ ఉంటుంది. 

అందువలన ఆ పరాభక్తుడు కర్తగా ఉండడు, భోక్తగా ఉండడు. అతడికి ఇష్టాయిష్టాలు ఉండవు. సకల వ్యాపారాలకు భగవంతుడే అధిష్ఠానంగా ఉంటాడు. 

ఇతరమైన అధిష్ఠానం గాని, ఉద్దీపనం గాని లేకుండుటను అనన్యత అని నిర్ణయిస్తారు. అందువలన పరాభక్తుడు అన్యాశ్రయాన్ని త్యాగం చేసి ఉంటాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment