✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 29
🌴. వాసవీమాతకు ఆర్యవైశ్యులతో అనుబంధం 🌴
🌻. నృసింహసరస్వతి అవతారం 🌻
మేము కురుంగడ్డ చేరి శ్రీపాదుల దర్శనం, పాదాభివందనం చేసిన తరువాత వారు ఇలా సెలవిచ్చారు, "నాయనలారా! నిన్న జరిగిన వాసవీ కన్యకా జయంతి ఉత్సవాన్నిచూసి మీరు ధన్యులయినారు.
దేశ, కాలాలు నా చేతిలోని ఆట బంతులు. ఎప్పుడో జరగవలసిన, జరుగుచున్న, జరుగ బోవు సంఘటనలని భూతకాలంలోకిగాని, వర్తమానంలోకి గాని, భవిష్యత్తులోకిగాని నేను మార్చగలను. భక్తులు తమతమ చైతన్య స్థాయినిబట్టి నన్ను అర్థం చేసుకొన గలుగుతారు.
మీలో ఉన్న నాలోనికి మీరు పూర్తిగా శరణార్థులై నా ఆదేశ ప్రకారం కర్మలని ఆచరించినట్లయితే మీ భారాలన్నీ నేనే భరించి మిమ్మల్నిఒడ్డుకి చేరుస్తాను," అని చెప్పి రాబోయే తమ అవతార వివరాలను ఇలా తెలిపారు.
"కలియుగ మానవులు హిరణ్యకశ్యపునిలాంటి వారు. భౌతిక శాస్త్రంలో ఎంతో అభివృద్ధిని సాధించి హిరణ్య కశ్యపునిలా ప్రకృతి మాతనుండి వరాలను పొందుతారు.
వారినుండి ప్రహ్లాదుని వంటి భక్తులను రక్షించడానికి నేను నృసింహుని గుణాలతోను, కేవలం నా మాటతో ప్రకృతిని శాసించకలిగే సరస్వతీ గుణంతోను, ఇలా ఈ రెండు గుణాల సమ్మేళనతో నృసింహసరస్వతీ అవతారాన్ని ధరిస్తాను. ఈ అవతారంలో గంధర్వపురంలో ప్రసిద్ధి పొందుతాను." ఆర్యవైశ్యుల గోత్రాల వివరణ
తరువాత వాసవీమాత గురించి మాట్లాడుతూ, "సమాధి అనే తపస్వి జగన్మాత భక్తుడు. అతడే కుసుమశ్రేష్ఠిగా జన్మించారు.
ఆద్యశక్తి వారి కుమార్తె అయిన వాసవిగా జన్మించింది. విష్ణువర్ధనుడు కోరరాని కోరిక కోరినాడు. ఆర్య వైశ్యులు అగ్నిగుండంలో దుమికి ఆత్మగౌరవం కాపాడుకో వాలని తలిచారు.
వాసవీమాత తమ తల్లితండ్రులకు, గోత్ర సంబంధీకులకు ఆర్యమహాదేవి రూపంలో దర్శనమిచ్చి వారందరు అగ్ని హోత్రంలో లీనమయిన తక్షణమే విష్ణు వర్ధనుడి శిరస్సు వేయి చెక్కలు అవుతుందని, వైశ్యకుల అధిదేవత అయిన నగరేశ్వరస్వామిని మరువక పూజించ మని, అలాగే కులదేవతల పూజ, గోత్ర పూజ చేయమని ఆదేశించి అటువంటి భక్తుల ఇళ్ళలో తమ కాలి అందెల రవళి వినిపించుతుందని, వారికి ఇహ-పర సుఖశాంతులు లభిస్తాయని," వాసవీమాత వారితో అన్న మాటలను శ్రీపాదులు మాకు తెలిపారు.
నేను ఆ 102 గోత్రీకుల వివరా లని అడుగగా, "మొట్టమొదటగా లాభాది మహర్షి గోత్రానికి చెందిన ధనదుణ్ణి, ధనలక్ష్మీని స్మరించాలి అని చెప్పి తరువాత 102 గోత్రాలు, వాటికి సంబంధించిన ఋషుల వివరాలు వివరించారు.
ఆ వివరణనంతా శ్రద్ధగా విన్న నేను, "ప్రభూ! తమరు సెలవిచ్చిన గోత్రాలలో లాభాది గోత్రం లేదు. దాన్ని వీటికి చేర్చినట్లయితే 103 గోత్రాలు అవుతాయి కదా," అని నా సందేహాన్ని వ్యక్త పరిచాను.
దానికి వారు, “లాభాదమహర్షికి సంబంధించిన గోత్రాలలో ధనదకుల, కాశ్యపస అని రెండు గోత్రాలు ఉన్నాయని, కాశ్యపస గోత్రం నిర్వంశం అయినందున దాన్ని తీసివేసి ఆ స్థానంలో ధనద కుల గోత్రం ఉంచినట్లయితే సరిగ్గా 102 గోత్రాలే అవుతాయని చెప్పారు.
కలియుగాంతంలో వాసవీ నగరేశ్వరుల వివాహం జరిగేటపుడు వధువుది ప్రభాతస గోత్రంగా, వరునిది కాశ్యపస గోత్రంగా చదవాలని వాసవి వివాహం జరిగేంత వరకు మాత్రమే 102 గోత్రాలలో ధనదకుల గోత్రం లెక్క లోనికి తీసుకోవాలని వివాహం జరిగాక కాశ్యపస గోత్రాన్ని లెక్కలోకి తీసుకోవాలని కలియుగాంతంలో ధనదకుల గోత్రం నిర్వంశం అవుతుందని చెప్పి అగ్ని కుండంలో ప్రవేశించిన 102 పుణ్య దంపతుల పేర్లు చెప్పి, ఈ ఆర్య వైశ్య దంపతుల పేర్లు స్మరించిన ట్లయితే పాపవిముక్తి అవుతుందని తెల్పారు.
తరువాత ముగ్గురం ధ్యానస్థులమయ్యాము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 198 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
CHAPTER 20
🌴. The Story of Vissavadhanulu Description of Sripada’s divine auspicious form - 5 🌴
The form of Brahman, from where all the avathars are emanating, is myself. A prey may be able to wriggle out of a tigers mouth, but you cannot escape from me. Datta devotees should be like lion cubs.
They should not become cowards. I am like a lion. Lion cubs will not have fear of a lion. They please their mother with their playful deeds. It is certain that I will kill you with this knife.
There is no one in all the three lokas who can save you.’ I started shouting frightened. Meanwhile, the dream dispersed. People in the house asked me what the matter was.
I narrated my dream to them. I wailed that it was due to the result of karma done in some previous birth that I am now suffering this poverty. Our financial problems increased. I thought it was better if I died.
Early morning one Haridas appeared in front of our house. He had ‘chiratalu’ (pair of wooden blocks clapped while singing). He was singing Hari’s name. He had a vessel on his head in which he would collect rice. He was a strange Haridasu.
He had a small ‘medi’ (oudumber) plant in that vessel. It is inauspicious not to give rice when Haridas is standing in front of the house. So, I searched in the house, found a fistful of broken grains of rice and gave them to Haridas.
He received those broken grains and said, ‘Sir! Yesterday night, one butcher killed a Datta devotee by name Gurucharana. The strange thing is that the man’s life force left his body and stood in this ‘medi plant’.
Dattatreya would reside at the root of Oudumber tree. This plant is not an ordinary one. There is a great kshetram called Sri Peethikapuram in Godavari mandalam.
People say that Swayambhu Datta is moving in disguise as Sripada Srivallabha. This plant is an offshoot of the Oudumbar tree present in Sripada’s grandfather’s house.
You plant it in your house and get all auspiciousness.’ My head started reeling. I told Haridas, ‘Sir! I am indeed Gurucharana. I was not killed. I am a devotee of Datta. I saw a butcher in a dream.
He told me that he would kill me with his knife. I heard that if any person died and his dead body was not traceable, wood from ‘medi’ tree would be arranged and the last rites performed thinking it as the dead body.
But I have not heard or seen attracting the life force of a person into a ‘medi’ plant and at the same time keeping the life in that person.’
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment