✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ...
📚. ప్రసాద్ భరద్వాజ
దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము (ఇంద్రియములు మరియు భోగ్య వస్తువులు మధ్య ) - ఇంద్రియ నిగ్రహము
శమము అంటే అంతరెంద్రియ నిగ్రహము (మనస్సుకు ఇంద్రియములకు మధ్య ) - మనో నిగ్రహము అని చెప్పినప్పటికీ సాధనా పరముగా రెండు కలిపే జరుగుతూ ఉంటాయి.
ప్రాపంచిక వస్తు సంపదలు, విషయ సుఖములందు బంధమున్నదని గ్రహించి విముఖత కలిగి ఉండి మనస్సును ఇంద్రియములతో కూడనివ్వక ఆత్మ లక్ష్యమందు నిలుపుట శమము.
మనము గాఢముగా ఏదైనా విషయమును గురించి ఆలోచిస్తున్న సమయమున మన ముందు జరిగిన సంఘటనలను కుడా మనము గుర్తించలేము. అంటే మనస్సు ఇంద్రియములతో జోడిస్తేనే విషయములను గ్రహించాగలుగుతాము.
కనుక ఇంద్రియ నిగ్రహ సాధనల వలన మనో నిగ్రహము బలపడితే మనో నిగ్రహ సాధనల వలన ఇంద్రియములు సులువుగా స్వాధీనమవుతాయి.
మనస్సు ఎందుకు బహిర్ముఖము అవుతుంది?
- విషయ సుఖములందు ఆసక్తి వలన
- విషయ సుఖములకు కావలసిన వస్తు సంపదలను ప్రోగుచేసుకోవలననే కోరిక వలన విషయాసక్తి
- విషయ వైరాగ్యము వలన, వస్తువుల కున్న పరిమితులు గుర్తించుట వలన
- వస్తు సంపదలు, విషయ సుఖములందు ఉన్న బంధము, దోషములను గుర్తించుట వలన తొలగుతుంది.
మనస్సు ఎందుకు అలజడికి లోనవుతుంది?
- జగత్తులో వ్యవహార సమయమున ప్రతిఫలము పట్ల ఆసక్తి కలిగి ఉండుట వలన
- జీవితములో జరుగుచున్న సంఘటనలను అంగీకరించలేక పోవుట వలనను
ఇవి
- దైవీసమర్పణ భావనతో, ప్రతిఫలాపేక్ష రహిత కర్మ చేయుట వలన
- ఈశ్వర నియతిని (కర్మను) అంగీకరించుట వలనను తొలగుతాయి.
ఎప్పుడైతే మనస్సు బహిర్ముఖము కాక, అలజడికి లోనుకాక శాంతముగా ఉంటుందో అటువంటి మనస్సు ఆత్మ జ్ఞాన విచారణకు, తనను తానూ తెలుసుకొనే దిశగా ప్రాయాణించుటకు అనుకూలముగా ఉంటుంది.
ఈ విధముగా మనస్సును శమింప చేయుటను శమము అంటారు.
ప్రాణాయామము, జపము, ఉపాసన మొదలగునవి శమమును పెంపొందించుకొనుటకు ఉపయోగ పడు సాధనలు.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment