🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 II ఆర్యా ద్విశతి - 123వ శ్లోకము II 🌻
యోజనయుగళాభోగా తద్వత్పరిణాహవలయమణిభిత్తిః I
చింతామణిగృహభూమి ర్జీయాదామ్నాయమయ చతుర్ద్వారా II ౧౨౩
🌻. తాత్పర్యము :
యోజనయుగళాభోగా - రెండు యోజనముల వైశాల్యము కలిగినదియు, తద్వత్ - అంతటి, పరిణాహ - వైశాల్యము గల, వలయ - చక్రాకారమైన, మణిభిత్తిః - రత్నమయమైన గోడ కలిగినదియు, ఆమ్నాయమయ - చతుర్వేదమయమగు, చతుర్ద్వారా - నాలుగు వాకిళ్ళు కలిగినదియు అగు, చింతామణిగృహభూమిః - చింతామణిగృహము యొక్క ప్రదేశము, జీయాత్ - సర్వోత్కృష్టముగా వర్తించుగాక !!
రెండు యోజనములు వైశాల్యము కలిగి, చక్రాకారములో ఉండి, రత్నమయమైన గోడలు కలిగి, నాలుగు వేదములను నాకు ద్వారములుగా కలిగిన చింతామణి గృహము -- దిగ్విజయముగా వర్ధిల్లుగాక !!
🌻 II ఆర్యా ద్విశతి - 124వ శ్లోకము II 🌻
ద్వారే ద్వారే ధామ్నః పిండీభూతా నవేన బింబాభాః I
విదధతు విమలాం కీర్తిం దివ్యా లౌహిత్యసింధవో దేవ్యః II ౧౨౪
🌻. తాత్పర్యము :
ధామ్నః - ఆ చింతామణి గృహము యొక్క, ద్వారే ద్వారే - ప్రతీ ద్వారము నందు, పిండీభూతా - గుంపులుగా ఉన్నవారును, నవేన బింబాభాః - క్రొత్తగా ఉదయించుచున్నట్టి సూర్యబింబ కాంతి గలవారును, లౌహిత్యసింధవః - ఎఱ్ఱదనమునకు సముద్రము వంటి వారును (ఎఱ్ఱని కాంతిపుంజము వంటివారు), దివ్యాః - ప్రకాశించుచున్నవారును అగు, దేవ్యః - దేవతాస్త్రీలు, విమలాం కీర్తిం - నిర్మలమైన యశస్సును, విదధతు - కలిగింతురుగాక !!
చింతామణి గృహమునకు ప్రతీద్వారము నందు గుంపులుగా ఉన్న, సూర్యకాంతి తేజస్సు కలిగిన దేవతా స్త్రీలు మాకు నిర్మలైన యశస్సును కలిగింతురుగాక !!
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment